‘దిల్ సే నవ్వుకోండి…దిల్లుకు మంచిది’ అనే కాప్షన్ తో ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి
on Dec 3, 2022
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కొత్త కొత్త మూవీస్ తో, వెబ్ సీరిస్ లతో పాటు మరెన్నో రియాలిటీ షోస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. డాన్స్ , సింగింగ్ రియాల్టీ షోస్ నిర్వహించి సక్సెస్ అయ్యింది ఆహా. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా కామెడీ షోను కూడా స్టార్ట్ చేసింది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోస్ ని బీటౌట్ చేయడానికి అన్నట్టుగా ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ సీజన్ వన్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఫస్ట్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఛైర్మన్ గా ఆహా ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ కార్యక్రమాన్ని ‘దిల్ సే నవ్వుకోండి … దిల్లుకు మంచిది’ అనే మాటతో మొదలు పెట్టారు. సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి హోస్ట్స్ గా ఈ షోని ముందుకు తీసుకెళ్లారు. ఇందులో అవినాష్, రాజు, వేణు, హరి, భాస్కర్ - జ్ఞానేశ్వర్, సద్దాం ఆరు టీమ్స్ గా పాల్గొన్నారు.
ఇక ఫస్ట్ రౌండ్ "అట్లుంటుంది మనతోనే" లో ‘స్కూల్ అండ్ కాలేజ్’ థీమ్ లో ఎవరికీ వారు ఇండివిడ్యువల్ గా ఇచ్చిన పెర్ఫార్మెన్సెస్ ని బట్టి ఆడియెన్స్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజి అనే యాప్ ద్వారా ఓట్లు వేశారు. ఇక కామెడీ స్టాక్ ఇండెక్స్ ప్రకారం ఫస్ట్ రౌండ్ లో సద్దాం మొదటి స్థానంలో నిలబడ్డాడు. ఇక సెకండ్ రౌండ్ లో "పదా చూసుకుందాం" లో పాత తెలుగు సామెతలను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి కామెడీ చేయాలి.
ఇక ఈ రౌండ్ ప్రతీ ఎపిసోడ్ కి మారుతూ ఉంటుంది అని చైర్మన్ చెప్పారు. ఇక ఈ సెకండ్ రౌండ్ లో యాదమ్మ రాజు ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇక మూడో రౌండ్ ‘ఇచ్చి పడేస్తాం’లో అందరూ కలిసి పార్టిసిపేట్ చేశారు. ఈ రౌండ్ లో కమెడియన్స్ ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్సెస్ కి మార్కులు వేశారు. ఈ మొత్తం మూడు రౌండ్స్ పూర్తయ్యే సరికీ ‘లాఫింగ్ స్టాక్ ఆఫ్ ది డే’గా అవినాష్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ‘ స్ట్రెస్ ఫ్రీ చిల్లెస్ట్ పెర్ఫార్మెన్స్’ కు సద్దాంని ఎంపిక చేశారు అనిల్ రావిపూడి. షోకి తగ్గట్టు ఎలా బొమ్మ దద్దరిల్లిపోయిందో మన స్టాక్ మార్కెట్ కూడా దద్దరిల్లిపోయింది అని చెప్పారు.
Also Read